కళ్లకురిచ్చి ఎమ్మెల్యే కేసు సీబీఐకి అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

కళ్లకురిచ్చి ఎమ్మెల్యే కేసు సీబీఐకి అప్పగించాలి

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

● గవర్నర్‌కు ఉదయనిధి స్టాలిన్‌ వినతి

సాక్షి, చైన్నె: కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేష్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసును తక్షణమే సీబీఐ దర్యాప్తుకు బదిలీ చేయాలని తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. గత ఆరు నెలలుగా తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, అధికార పార్టీ నేతల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. వివరాలు.. జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేదింపు వ్యవహారం తమిళనాట దురామారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈకేసులో ఎమ్మెల్యేను ఓ వైపు,కలెక్టర్‌నుమరో వైపు ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. కళ్లకురిచ్చి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు కలెక్టర్‌ రహస్య వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అదే సమయంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలను విస్తృతం చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితులో ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ తన పార్టీకి చెందిన ఎంపీలు దయానిఽధి మారన్‌,కళానిధి వీరాస్వామితో కలిసి గవర్నర్‌ బంగ్లాకు ఉదయం వెళ్లారు. ఆయనను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా సమగ్ర వివరాలతో ఓ లేఖను అందజేశారు.

సీబీఐ దర్యాప్తుకు పట్టు

ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేష్‌ను అరెస్టు చేసి, ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను సేకరించి, నిర్ణీత కాలపరిమితిలో విచారణ పూర్తి చేసేలా కేసును సీబీఐకి బదిలీ చేయాలని ప్రభుత్వా న్ని ఆదేశించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 167 (బి) ప్రకారం, 2026 జూన్‌ నుంచి రాష్ట్రంలో శాంతిభద్ర తల పరిస్థితి, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, మే 2026 నుంచి నమోదైన డ్రగ్స్‌ కేసుల వివరాలపై ముఖ్యమంత్రి నుంచి సమగ్ర నివేదిక కోరాలని విన్నవించారు.

సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి..

గవర్నర్‌ ఆర్లేకర్‌ను కలిసినానంతరం మీడియాతో శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, నేరాలను అరికట్టడంలో విఫలమైనందుకుసీఎం విజయ్‌ స్వయంగా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిణి తనకు ఎదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా, 116 రోజులుగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధితురాలిని వేరే జిల్లాకు బదిలీ చేస్తానని ప్రధాన కార్యదర్శి ఆఫర్‌ ఇవ్వడం చూస్తుంటే, ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోందన్నారు. శాంతిభద్రతలు, ఐఏఎస్‌ అధి కారుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయని, ఈ దృష్ట్య్టా ఈ నేరాన్ని కప్పిపుచ్చిన ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం విజయ్‌ను కూడా సహ నిందితుడిగా కేసులో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై తమకు ఏమాత్రం నమ్మ కం లేదని, నిష్పక్షపాత విచారణ కోసం తక్షణమే కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement