తిరుమల వేంకటేశ్వర స్వామివారికి చైన్నెకి చెందిన పారిశ్రామిక వేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం కానుకగా సమర్పించారు. దాత కుటుంబ సభ్యులు తలపై ఆభరణాల పళ్లెంలను ఉంచుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, శ్రీవారి సన్నిధికి చేరుకుని ఆభరణాలను స్వామివారి ఎదుట సమర్పించి పూజలు చేశారు. ఇందులో మొత్తం 33 రకాల ఆభరణాలు 46 ఉన్నాయి. ఈ ఆభరణాల్లో వజ్రాల మొత్తం బరువు 238.2 క్యారెట్లు, నీలమణులు 2,247.7 క్యారెట్లు, పసుపు నీలమణులు 91.6 క్యారెట్లు, కెంపులు, పచ్చలు 84.2 క్యారెట్లు, సాలగ్రామ రాళ్లు 2,916.5 గ్రాములు ఉన్నాయి. – తిరుమల


