పళ్లిపట్టు: బావి ప్రహరీగోడను బైకు ఢీకొన్న ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని పెరుమూచ్చి గ్రామానికి చెందిన నందన్ కుమార్తె జయలక్ష్మి(21) ఐటీఐ చదవుకుని ఇంట్లో వుండేవారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట పొదటూరుపేట సమీపంలోని ఈసంతోప్పులో యువతి అత్త ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం కృష్ణాపురం జలాశయం చూసేందుకు వీలుగా జయలక్ష్మి అత్త కొడుకు నితీష్(18)తో కలిసి స్కూటీలో బయల్దేరారు. పొదటూరుపేట వద్ద వెళ్తుండగా తిరుత్తణి రాష్ట్ర రహదారి సమీపంలోని బావికి అడ్డుగా వున్న ప్రహరీగోడను స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో జయలక్ష్మి తలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు పొదటూరుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అనంతరం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా ప్రాణాలు కోల్పోయారు. పొదటూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


