చైన్నె డివిజన్‌ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

చైన్నె డివిజన్‌ ప్రగతి

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

– గూడ్స్‌ టెర్మినల్‌ ద్వారా వాహన రవాణా

సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమకు అవసరమైన వేగవంతమైన, సురక్షితమైన , సరుకు రవాణా సేవలను అందిస్తూ గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. సింగపెరుమాళ్‌ కోవిల్‌ గూడ్స్‌ షెడ్‌ వాహనాల రైలు రవాణాలో కీలక కేంద్రంగా మారింది. డైమ్లర్‌, భారత్‌ బెంజ్‌ లారీలు సింగపెరుమాళ్‌ కోవిల్‌ నుండి 2,291 కి.మీ దూరంలో ఉన్న ఫరూఖ్‌ నగర్‌కు 494 భారత్‌ బెంజ్‌ లారీలను (8 రేక్స్‌ / 255 వ్యాగన్లు) రవాణా చేసినట్టు రైల్వే అధికారులు వివరించారు. మొత్తం 24,708 హుందాయ్‌ కార్లు, 202 టయోటా కార్లను రవాణా చేశామన్నారు. లారీలు, కార్ల రవాణా ద్వారా సింగపెరుమాళ్‌ కోవిల్‌ గూడ్స్‌ టెర్మినల్‌ ఒక్కటే మొత్తం రూ41.62 కోట్ల సరుకు రవాణా రాబడిని సాధించిందని ప్రకటించారు.ఆటోమొబైల్‌ రవాణాకు రోడ్డు మార్గం కంటే రైల్వే సరుకు రవాణా అత్యంత సమర్థవంతమైనదిగానూ, పర్యావరణహితమైనదిగానూ నిరూపితమవుతోందని, భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని పరిశ్రమలకు విస్తరిస్తామని చైన్నె రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement