లక్ష్మీ అలంకరణలో వాసవీ అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీ అలంకరణలో వాసవీ అమ్మవారు

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

కొరుక్కుపేట: సూర్యప్రభ వాహనంపై లక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. చైన్నె నగరంలో 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు –2026 వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు సోమవారం వేదపారాయణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూల మంత్ర హోమం ,అభిషేకం,విన్నపములు, దీపారాధన శాస్త్రోక్తంగా చేపట్టారు. నవరాత్రి వేడుకల్లో రెండో రోజు సోమవారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు సూర్యప్రభ వాహనం పై లకీ్‌ష్మ్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేదీప్యమానంగా లక్ష్మీ అలంకరణలోని అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. భక్తి కార్యక్రమాలలో భాగంగా టి.దార్నిక భరతనాట్యం, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ, తెలుగు తరుణి, ఎస్‌కేపీసీ విద్యార్థుల భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చారిటీస్‌ సెక్రటరీ కిషోర్‌ కుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement