వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వినతి | - | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వినతి

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

తిరుత్తణి: బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వీలుగా గోడౌన్‌ నిర్మించాలని రైతులు బీడీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు. తిరుత్తణి యూనియన్‌లోని బుచ్చిరెడ్డి పల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 గ్రామాల్లో 10వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. గతంలో కృష్ణసముద్రంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించి రూ. 30 లక్షల వ్యయంతో గోడౌన్‌ నిర్మించారు. అయితే గోడౌన్‌కు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కొత్తగా నిర్మించిన వరి ధాన్యం నిల్వ గోడౌన్‌ నిరుపయోగంగా మారింది. దీంతో ప్రభుత్వ వరి కొనోగులు కోసం రైతులు బీరకుప్పం వరకు వెళ్లాల్సి రావడంతో ప్రయివేటు వ్యాపారులకు వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో వచ్చే సీజన్‌లో బుచ్చిరెడ్డి పల్లి కేంద్రంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వీలుగా వరి నిల్వ గోడౌన్‌ నిర్మించాలనే మేరకు రైతులు తిరుత్తణిలో బీడీఓ శాంతిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement