వేలూరు: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని జోహోలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రముఖు సీరియల్ నటి దైవాని తెలిపారు. వేలూరులోని లాంగ్వేజ్ పిల్లర్ బాషా పాఠశాలలో లాంగ్‌థాన్ టుకే 26 రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేలూరు జిల్లాలోని మొత్తం 83 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. తమిళం, ఇంగ్లీష్, హిందీ, ప్రెంచ్, జర్మనీ వంటి ఐదు బాషలను కేంద్రంగా చేసుకొని జరిగిన ఈ కార్యక్రమంలో ఫోనిక్స్ ఛాలెంజ్ పబ్లిక్ స్పీకింగ్, యంగ్ ఆథర్, డిజైన్ థింకింగ్, డ్రీమ్ ఐఏఎస్, వేదిక మ్యాథ్స్, లాంగ్వేజ్ ప్రెండ్లీ అనే ఆరు విభాగాలుగా పోటీలు జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు తమ బాషా ప్రావీణ్యం, సాధారణ జ్ఞానం, సృజనాత్మకత, వినూత్న ఆలోచన విధానం, ప్రసంగ సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు ప్రదర్శించడంలో రాణించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


