తిరువళ్లూరు: ఆంధ్ర నుంచి తమిళనాడుకు లారీలో గంజాయిని తరలించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని లారీనీ సీజ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలోని ఆరణి సబ్ ఇన్పెక్టర్ శక్తివేలు నేతృత్వంలోని పోలీసులు పుదువాయిల్–పెద్దపాళ్యం రోడ్డులోని అగరం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనీఖీ చేశారు. ఈ సమయంలో ఆంధ్ర నుంచి తమిళనాడుకు వస్తున్న లారినీ ఆడ్డుకున్న పోలీసులు తనీఖీలు నిర్వహించగా, రెండు బస్తాలను గుర్తించారు. అందులో సుమారు 40 కిలోల గంజాయి వున్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. అనంతరం గంజాయినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీని సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన విచారణలో పట్టుబడిన నిందితుడు దిండుక్కల్ జిల్లాకు చెందిన మురుగన్(50)గా గుర్తించి అతడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


