తిరుత్తణి: ఆంధ్రాలోని అనంతపురం జిల్లాలో బర్డ్‌ప్లూ ప్రబలి కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం ఆంధ్ర సరిహద్దులో బర్డ్‌ప్లూ అరికట్టేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇందుకోసం తిరుత్తణి సమీపంలోని ఆంధ్రా సరిహద్దులోని పొన్పాడి చెక్‌పోస్టు వద్ద పశుసంవర్ధక శాఖ సమాయ డాక్టర్, ఇన్‌స్పెక్టర్, సహాయకుడు తదితరుల బృందం ఆంధ్రా నుంచి తమిళనాడులో ప్రవేశిస్తున్న వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వాహనాలకు క్రిమి సంహారక మందు వెదజెల్లుతున్నారు. రోజుకి మూడు సిప్టులలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రోజు వెయ్యి వాహనాలు తనిఖీ చేసి క్రిమి సంహారక మందు వెదజెల్లుతున్నట్లు పశుసంవర్ధక శాఖ సహాయ డైరెక్టర్ అనిత తెలిపారు.


