రైల్వే 4వ టెర్మినల్‌గా పెరంబూరు | - | Sakshi
Sakshi News home page

రైల్వే 4వ టెర్మినల్‌గా పెరంబూరు

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● విల్లివాక్కం– అంబత్తూరు మధ్య 5,6 మార్గాలు ● 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తికి దక్షిణ రైల్వే కార్యాచరణ

సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నెలోని పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ను నాలుగో రైల్వే టెర్మినస్‌గా అభివృద్ధి చేసే బృహత్తర ప్రాజెక్టు దక్షిణ రైల్వే కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, విల్లివాక్కం – అంబత్తూర్‌ మధ్య 5, 6వ కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి దక్షిణ రైల్వే టెండర్లను ఆహ్వానించింది. రూ. 1,546 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివరాలు.. రాజధాని నగరం చైన్నెలో పురాతన, అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా డాక్టర్‌ ఎంజీఆర్‌ సెంట్రల్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆ తదుపరి ఎగ్మూర్‌ స్టేషన్‌ ఉంది. మూడో రైల్వే టెర్మినల్‌గా తాంబరం ఏర్పాటైంది. ప్రస్తుతం ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దే పనులు జరుగుతోన్నాయి. అదే సమయంలో సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌పై కూడా దృష్టి పెట్టారు. చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ ఎరుపు రంగులో పురాత కోటను తలపించే విధంగా గాంభీర్యంగా కనిపిస్తుంటుంది. ఇక్కడకు రోజు వందలాది రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. ఇందులో 90 సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఉన్నాయి.రోజుకు నాలుగు లక్షల మంది ఈ స్టేషన్‌కు వచ్చి వెళ్తుంటారు. ఈ స్టేషన్‌కు ఆనుకూని ఎలక్ట్రిక్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఎలక్ట్రిక్‌ రైల్వే స్టేషన్‌తోపాటుగా మొత్తం 17 ప్లాట్‌ ఫాంలు సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి. చైన్నె విమానాశ్రయం హంగులను తలపించే విధంగా సెంట్రల్‌ను కొత్తగా తీర్చిదిద్దేదకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రవేశ మార్గం పరిసరాలో ఏసీ విశ్రాంతి గదులు, రూప్‌ ప్లాజా, వర్తక కేంద్రం ఫుట్‌ కోర్టులు, బార్‌లు, తదితర అన్ని రకాల దుకాణాలతో కూడిన బ్రహ్మాండ మాల్‌ ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఆధునిక హంగులతో టికెట్టు కేంద్రాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు వంటి అన్ని రకాల కొత్త దనాన్ని నింపే విధంగా, ప్రయాణీకులకు మెరుగైన సేవల దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు.

రైల్వే మార్గాలు..

కొన్నిరైళ్లు సెంట్రల్‌కు రాకుండా పెరంబూరు నుంచి కొరుక్కు పేట మీద దారి మళ్లించడం , మరికొన్ని రైళ్ల సేవలను పెరంబూరు నుంచి పట్టాలెక్కించే దిశగా ఈ కార్యచరణ కసరత్తుల చేపట్టారు. ఇందులో భాగంగా విల్లివాక్కం – అంబత్తూర్‌ మధ్య కొత్త రైల్వే మార్గాలు అనివార్యంగా మారాయి. ప్రస్తుతం నాలుగు మార్గాలు ఉన్నప్పటికి, 5, 6 మార్గాల పనులకు సిద్ధమయ్యారు.ఈ నిర్మాణంతో పాటు భూసేకరణ, సివిల్‌ ఇంజనీరింగ్‌, సిగ్నలింగ్‌ – టెలికమ్యూనికేషన్స్‌, విద్యుదీకరణ , ఓవర్‌హెడ్‌ పవర్‌ లైన్ల ఏర్పాటు వంటి పనులను టెండర్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. చైన్నె సెంట్రల్‌ – అరక్కోణం మార్గంలో పెరంబూర్‌ చాలా కీలకమైన స్టేషన్‌. ఈ మార్గంలో ప్రతిరోజూ 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 150కి పైగా ఈఎంయూ ఎలక్ట్రిక్‌ రైళ్లు నడుస్తున్నాయి. సెంట్రల్‌ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకే ఈ అదనపు టెర్మినల్‌, కొత్త ట్రాక్‌లను ఏర్పాటు తాజాగా అవశ్యమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసిన రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులకు 1,546 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించి ఉన్నామన్నారు.

సెంట్రల్‌ స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు..

చైన్నె ఎగ్మోర్‌లో రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తాంబరం స్టేషన్ల 3వ టెర్మినల్‌గా తీర్చిదిద్ది దక్షిణ తమిళనాడు వైపుగా సాగే అనేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. అదే సమయంలో సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కూట వేటు దూరంలో ఉన్న పెరంబూరు రైల్వే స్టేషన్‌ను 4వ టెర్మినల్‌గా తీర్చిదిద్దే కార్యాచరణకు చర్యలు చేపట్టారు. రూ. 360 కోట్ల వ్యయంతో నాలుగో టెర్మినల్‌గామార్చే పనులపై దృష్టి పెట్టారు. కొత్త టెర్మినల్‌ పనులలో భాగంగా అధునాతన పార్కింగ్‌, పార్శిల్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, మెరుగైన ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 4 ప్లాట్‌ఫారమ్‌లకు అదనంగా మరో 2 ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement