సముద్ర రంగంలో యువత, మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సముద్ర రంగంలో యువత, మహిళలకు పెద్దపీట

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌

సాక్షి, చైన్నె : సముద్ర రంగంలో యువత, మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ , జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాగర్‌మంతన్‌ – ది గ్రేట్‌ ఓషన్స్‌ డైలాగ్‌ 2026 గురించి వివరించారు. భారత్‌ సముద్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత, మహిళల పాత్రే అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ కేవలం సముద్ర సామర్థ్యం నుంచి అద్భుతమైన పనితీరు దిశగా దూసుకెళ్తున్నట్లు తెలిపారు. గడిచిన పన్నెండేళ్లలో పోర్టు సామర్థ్యం 1,561 నుంచి 2,817ఎంటీపీఏకి పెరిగిందన్నారు.కార్గో నిర్వహణ సామర్థ్యం 1,052 నుంచి 1,668 మిలియన్‌ టోన్లకు చేరింన్నారు. నెట్‌ జీరో 2070 నిబద్ధతకు అనుగుణంగా గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా, మెతనాల్‌ ఉత్పాదకతను పెంచుతూ భారతీయ పోర్టులను గ్రీన్‌ హబ్స్‌గా మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.వివిధ దేశాలతో సంప్రదింపు, భాగస్వామ్య ఒప్పందాలు వేగం పుంజుకున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement