50 మంది పిల్లలకు అరుదైన చికిత్స విజయవంతం | - | Sakshi
Sakshi News home page

50 మంది పిల్లలకు అరుదైన చికిత్స విజయవంతం

Oct 7 2026 12:35 AM | Updated on Oct 7 2026 12:35 AM

– అపోలో వైద్యుల ఘనత

సాక్షి, చైన్నె : చైన్నె అపోలో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వైద్యరంగంలో మరో మైలురాయిని అధిగమించింది. పుట్టుకతోనే తీవ్రమైన గుండె సంబంధిత లోపాలతో బాధపడుతున్న చిన్నారుల కోసం చేపట్టిన ఈ కొత్త వైద్య విధానంలో అపూర్వ విజయం సాధించింది. పుట్టుకతోనే గుండెలో తీవ్ర లోపాలు (సింగిల్‌–వెంటికల్‌ డిసీజ్‌) ఉన్న 50 మంది పిల్లలకు ఎలాంటి ఓపెన్‌–హార్ట్‌ సర్జరీ (తెరచిన గుండె శస్త్రచికిత్స) లేకుండా, పూర్తిగా కథీటర్‌ ఆధారిత శ్రీపెర్య్యూటేనియస్‌ ఫాంటన్‌ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి అపోలో ఆసుపత్రి రికార్డు సష్టించింది.

తక్కువ నొప్పితో కూడిన వైద్యం: అపోలో పీడియాట్రిక్‌ కార్డియాలజీ , కార్డియోథొరాసిక్‌ సర్జరీ వైద్య బృందం అభివద్ధి చేసిన ఈ కొత్త విధానం ద్వారా.. రక్తం నాళాల గుండా కథీటర్లు, వైర్లు, స్టెండ్స్‌ను పంపి, ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా చర్మం ద్వారానే ఈ ఫాంటన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల పదేపదే ఓపెన్‌–హార్ట్‌ సర్జరీలు చేయాల్సిన పిల్లల బాధను, నొప్పులను గణనీయంగా తగ్గించవచ్చు. బుధవారం జరిగిన కార్యక్రమంలో పీడియాట్రిక్‌ కార్డియాలజీ విభాగం, డాక్టర్‌ సి.ఎస్‌. ముత్తుకుమరన్‌, సర్జరీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ.జి. సాలమన్‌లు మాట్లాడుతూ, అపోలో వైద్యుల ఈ అద్భుత ప్రయోగం , పరిశోధనలకు సంబంధించిన వివరాలు 2023, 2024, 2025 సంవత్సరాలలో పలు అంతర్జాతీయ వైద్య జర్నల్స్‌లో ప్రచురితమై ప్రపంచ వైద్య నిపుణుల ప్రశంసలను అందుకున్నాయన్నారు. చిన్నారి గుండె జబ్బుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, సాంప్రదాయ శస్త్రచికిత్సలకు అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని చూపుతున్న తమ బృందాన్ని అభినందించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement