రూ. 4,730 కోట్ల ఇసుక స్కాం | - | Sakshi
Sakshi News home page

రూ. 4,730 కోట్ల ఇసుక స్కాం

Oct 7 2026 12:35 AM | Updated on Oct 7 2026 12:35 AM

● విచారణ ప్రారంభించిన డీవీఏసీ

సాక్షి, చైన్నె: తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ ఇసుక తవ్వకా ల అవకతవకలపై తాజాగా టీవీకే ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అందించిన ఆధారాల ఆధారంగా అవినీతి నిరోధక శా ఖ (డీవీఏసీ) అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లోని 28 నదీ తీర ఇసుక క్వారీల లో అనుమతించిన పరిమితులకు మించి విచ్చలవిడిగా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించినట్లు గతంలో రాష్ట్ర డీజీపీకి నివేదిక పంపింది.

రూ. 4,730 కోట్ల అక్రమ తవ్వకాలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఐఐటీ నిపుణుల సహాయంతో జియో–స్కానింగ్‌, ఉపగ్రహ చిత్రాల ద్వారా జరిపిన సర్వేలో రూ. 4,730 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తవ్వబడినట్లు గుర్తించారు. ఇసుక తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాల జీపీఎస్‌ కోఆర్డినేట్లు, అవి పని చేసిన గంటలు, సమయాలు, నిర్దిష్ట ప్రదేశాల ఆధారంగా కచ్చితమైన సాక్ష్యాలను సేకరించారు.

రాజకీయ ప్రాముఖ్యత

నదీ ఇసుక క్వారీలలలో అక్రమాలపై గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా, తాజాగా టీవీకే ప్రభుత్వం ఈ విచారణ పై దృష్టిపెట్టడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన కీలక నేతల వైపు కూడా విచారణ మరలుతుండటం గమనార్హం.ఈ ఇసుక కుంభకోణానికి సంబంధించి డీవీఏసీ ప్రాథమిక సమగ్ర విచారణను వేగవంతం చేయడంతో త్వరలోనే తదుపరి చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement