చైన్నెలో చెస్ట్‌ స్కల్ప్‌ 2.0 సదస్సు | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో చెస్ట్‌ స్కల్ప్‌ 2.0 సదస్సు

Oct 7 2026 12:35 AM | Updated on Oct 7 2026 12:35 AM

కొరుక్కుపేట: చైన్నె ప్లాస్టిక్‌ సర్జరీ (సీపీఎస్‌) ఆధ్వర్యంలో, ప్లాస్టిక్‌ సర్జన్ల కోసం ప్రత్యేక శస్త్రచికిత్స విద్యా కార్యక్రమం ఘనంగా జరిగింది.రెండవ ఎడిషన్‌గా చెస్ట్‌ స్కల్ప్‌ 2.0 – అడ్వాన్స్‌డ్‌ గైనెకోమాస్టియా సర్జరీ అండ్‌ మేల్‌ చెస్ట్‌ కాంటూరింగ్‌ అనే పేరుతో ఈ సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రత్యక్ష గైనెకోమాస్టియా శస్త్రచికిత్స, శస్త్రచికిత్స ప్రణాళిక, కేస్‌–ఆధారిత చర్చ తదితర వాటిపై సమావేశం జరుగగా, చైన్నె ప్లాస్టిక్‌ సర్జరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ , ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కార్తీక్‌ రామ్‌ నేతృత్వం వహించిన మాట్లాడుతూచెస్ట్‌ స్కల్ప్‌ 2.0శ్రీ కేవలం పరిశీలనకే పరిమితం కాకుండా ముందుకు సాగాల ని లక్ష్యంగా పెట్టుకుందన్నారు .రోగిని అంచనా వేయడం, శస్త్రచికిత్సకు ముందు గుర్తులు పెట్టడం నుండి కణజాల మూల్యాంకనం, ఆకృతి ప్రణాళిక, సాంకేతిక ఎంపిక , శస్త్రచికిత్స సమయంలో మార్పు లు చేయడం వరకు – ప్రతి శస్త్రచికిత్స నిర్ణయం వెనుక ఉన్న వైద్యపరమైన తార్కికతపై దృష్టి సారించినట్టు తెలిపారు. మూడు ప్రత్యక్ష గైనెకోమాస్టియా శస్త్రచికిత్స కేసులను ప్రదర్శించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement