తగప్పన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

తగప్పన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Aug 4 2026 1:47 AM | Updated on Aug 4 2026 1:47 AM

తమిళసినిమా: జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తగప్పన్‌. లార్క్‌ స్టూడియోస్‌ పతాకంపై కే. కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ వెంకట్‌ కథా దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. నటుడు జీవా ఇంతకుముందు నటించిన తలైవన్‌ తంబి తలైమైయిల్‌ చిత్రం సంచల విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇది మధురై నేపథ్యంలో సాగే కథ చిత్రం. కాగా తాజాగా నటిస్తున్న తగప్పన్‌ చిత్రం కూడా మదురై నేపథ్యంలో సాగే కథ చిత్రమే కావడం విశేషం. ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ప్రధాన ఇతివృత్తంగా సాగే మానవ సంబంధాలు ,అనుబంధాలు వంటి కుటుంబ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ మొదలై పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ 50 శాతం పూర్తయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌ పోస్టర్ను విడుదల చేసినట్లు చెప్పారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. ఇకపోతే షూటింగ్‌ వస్తున్న చూడటానికి ప్రేక్షకులు నిత్యం ఆసక్తి చూపుతూ, చాలా బాగుందంటూ ఎంజాయ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. బలమైన కథ, కథనం, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం, చిత్ర నిర్మాణం కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం నటుడు జీవా కెరియర్లో మైలు రాయిగానే కాకుండా, చిత్రపశ్రమంలో గొప్పగా చెప్పుకునే కుటుంబ కథాచిత్రంగా నిలిచిపోతుందని నమ్మకాన్ని యూనిట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎం సుకుమార్‌ ఛాయాగ్రహణం, మార్షల్‌ రాబిన్సన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన సంగీత దర్శకుడు అనిరుద్‌ శిష్యుడు అన్నది గమనార్హం. అంతేకాకుండా పలు ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ లను రూపొందించారు. కాగా చిత్రాన్ని డిసెంబర్‌ నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు.

తగప్పన్‌ చిత్రంలో బాల నటుడితో జీవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement