న్యూస్‌రీల్
గత ఏడాది జరిగిన పెను విషాదం తర్వాత సీఎం హోదాలో తొలిసారి సీ జోసెఫ్ విజయ్ శుక్రవారం కరూర్‌కు వెళ్లనున్నారు. గత
విషాదంలో బాధితులైన కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
కుటుంబానికి ఒకటి చొప్పున ఉద్యోగాలు కేటాయించనున్నారు.
సాక్షి, చైన్నె : 2025 సెప్టెంబర్ 27న కరూర్ వేలుస్వామి పురంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన ఈ పెను విషాదం దేశాన్నే కలవరంలో పడేసింది. ఈ ఘటన తదుపరి టీవీకే చీఫ్ విజయ్ తీవ్ర మనో వేదనలో పడ్డారు. కొద్ది రోజుల తర్వాత బాధిత కుటుంబాలను చైన్నెకు పిలిపించి ఆర్థికసాయం అందజేశారు. ఈసందర్భంగా వారికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రస్తుతం చర్యలు చేపట్టారు. ఇది వరకు టీవీకే చీఫ్‌గా బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం విజయ్ ప్రస్తుతం సీఎం హోదాలతో ప్రపథమంగా శుక్రవారం కరూర్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. సీఎం విజయ్ శుక్రవారం ఉదయం విమానంలో తిరుచ్చి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్ వెళ్తారు.
తమిళనాడులో పారిశ్రామిక విప్లవం
త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సచివాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రతిరోజూ వరుస సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో పరిశ్రమల శాఖ సంప్రదింపుల సమావేశం జరిగింది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త వ్యాపారాలు మరియు పరిశ్రమలను ఎక్కడెక్కడ ప్రారంభించాలనే అంశాలపై ఈ అధ్యయన సమావేశంలో సవివరంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలను భారీగా పెంచేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ముఖ్యమంత్రి విజయ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రాబోయే బడ్జెట్‌లో ప్రకటించనున్న సరికొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల రూపకల్పనపై ఈ సమావేశంలో ప్రాథమిక ప్రకటనలు కూడా చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనతో పాటు ఆ శాఖకు చెందిన అగ్రశ్రేణి అధికారులు, పారిశ్రామిక రంగ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో తమిళనాడులో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంపై కూడా సీఎం చర్చించారు. ఇందుకు సంబంధించి ఇంధన ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడంలో లక్ష్యంగా ఆదేశాలిచ్చారు.
ప్రభుత్వ కార్యక్రమం
మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అనంతరం వైన్నెమలైలోని అట్లాస్ కళైయరంగం మైదానంలో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సభకు సుమారు 5,000 మందికి మాత్రమే అనుమతి కల్పించారు. హాజరయ్యే వారందరికీ క్యూఆర్ కోడ్ ఆధారిత పాస్‌లు తప్పనిసరి చేశారు. కరూర్ సమీపంలో ఏర్పాటు కానున్న ఒక ప్రైవేట్ నాన్–లెదర్ (తోలు రహిత) పాదరక్షల తయారీ యూనిట్‌కు ముఖ్యమంత్రి విజయ్ ఇదే వేదిక నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది.
్గ్ఛభారీ భద్రతా ఏర్పాట్లు
సీఎం పర్యటన నేపథ్యంలో సుమారు 6,000 నుంచి 6,500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తిరుచ్చి –కరూర్ మార్గంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కీలక మంత్రులు కరూర్‌లో తిష్ట వేశారు.


