త్యాగరాజన్ ప్రకటన
కొరుక్కుపేట: డీఎంకే మాజీ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించిన తరువాత ఆర్థిక మంత్రిగా, సమాచార సాంకేతికత, డిజిటల్ సేవల మంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికలలో మదురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పి.టి.ఆర్.పళనివేల్‌పై పోటీ చేసిన టీవీకేకు చెందిన ముస్తఫా చేతిలో 19 వేల 128 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిస్థితిలో తాను పలు కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయమై ఆయన జారీ చేసిన ఒక ప్రకటనలో ఇలా అన్నారు. గత 10 సంవత్సరాలుగా శాసనసభ సభ్యుడిగా ఉండడం తాను, తన బృందం పగలు రాత్రి తేడా లేకుండా నిరంతర బాధ్యతగా పనిచేశామన్నారు. ఇప్పుడు తాను ఆ బాధ్యతల నుండి కొన్ని వారాలపాటు విరామం తీసుకుని, ఒక సాధారణ పౌరుడిగా ఉండాలని అనునకుంటున్నట్టు తెలిపారు.
నటుడు ముత్తుకాళికి సతీ వియోగం
తమిళసినిమా: తమిళ సినిమాలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన నటుడు ముత్తుకాళి. ఈయన భార్య పేరు మాలతి (47). వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కాగా మాలతికి ఇటీవల తలలో గడ్డ కట్టటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.ఈమె గత 19 రోజల క్రితం స్థానిక కీల్‌పాక్కమ్ ఆస్పతిలో చేర్చారు. వైద్యులు మాలతికి శస్త్ర శికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె శ్వాసకోస సమస్యతో బాధపడ్డారు. కాగా చికిత్స పొందుతూ మాలతి సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని ముత్తుకాళి సొంతమూరు అయిన విరుదునగర్ జిల్లా, రాజపాళయం తాలుకా, సంగంపట్టి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ సోమవారం సాయంత్రం మాలతి పార్దీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ముత్తుకాళి భార్య మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


