తమిళ హక్కుల రక్షణలో తగ్గేది లేదు | - | Sakshi
Sakshi News home page

తమిళ హక్కుల రక్షణలో తగ్గేది లేదు

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

● సొంత దేశంలోనే శరణార్థులుగా మార్చే కుట్ర ● స్టాలిన్‌ ఆగ్రహం

సాక్షి, చైన్నె:తమిళుల హక్కుల పరిరక్షణలో తగ్గేది లేద ని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పున ర్‌ వ్యవస్థీకరణ బిల్లు ద్వారా తమిళనాడు ప్రజలను తమ సొంత దేశంలోనే శరణార్థులను చేయాలని చూసిన బీజేపీకి, వారికి వత్తాసు పలుకుతున్న అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీగిపోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ విపక్ష కూటమి నేతలకు, ప్రజలకు శనివారం కృతజ్ఞతలు తెలియజేశారు.

చీకటి చట్టంపై విజయం

డీలిమిటేషన్‌ అనే చీకటి చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం విజయం సాధించిందన్నారు. దీని వలన కలిగే ప్రమాదాన్ని ఏడాది క్రితమే గుర్తించి, ఇండియా కూటమి నేతలను ఏకం చేశామన్నారు. నల్లజెండాల నిరసన నుండి దిండిగల్‌లో నిప్పురవ్వ వరకు.. ఆ సెగ పార్లమెంటును తాకిందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి అని పేర్కొంటూ, ఇది బీజేపీ పతనానికి ఆరంభమని పేర్కొన్నారు. ఉత్తర–దక్షిణ విభజనను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న వారికి ఇది సరైన సమాధాన ం అని అన్నారు.

మహిళా రిజర్వేషన్లపై విమర్శ

మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ చూసిందని, అయితే మహిళలే ఈ మో సాన్ని కనిపెట్టి ఓడించారని పేర్కొన్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యతోనే తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా మమతా బెనర్జీ, కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి జాతీయ నేతలందరికీ స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సిద్ధరామయ్య, రేవంత్‌ రెడ్డి, పినరయి విజయన్‌ వంటి దక్షిణాది ముఖ్యమంత్రుల సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనను సమర్థించిన ఎడప్పాడి పళనిస్వామి బృందం తమిళనాడుకు ద్రోహం చేసిందన్నారు. ఆయన ఢిల్లీకి ఏజెంట్‌గా మారిపోయారని స్టాలిన్‌ మండిపడ్డారు. గతంలో హిందీ వ్యతిరేక పోరాటాల నుండి నేటి హక్కుల పోరాటం వరకు డీఎంకే ఎప్పుడూ ముందుంటుందని, 2026 ఎన్నికల్లో బీజేపీ–అన్నాడీఎంకే కూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు.

బనియన్‌ కార్మికులతో సమావేశం

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం స్టాలిన్‌ శనివారంతిరుపూర్‌లో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన అకస్మాత్తుగా ఒక ప్రైవేట్‌ బనియన్‌ కంపెనీని సందర్శించి, అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో ముఖాముఖి చర్చించారు. ప్రస్తుతం అందుతున్న మహిళా హక్కుల పథకం గురించి ఆరా తీశారు. ‘ద్రావిడ మోడల్‌ 2.0‘ ప్రభుత్వం ఏర్పడగానే, ఈ భత్యాన్ని రూ. 2000లకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని, ప్రభుత్వం ఏర్పడగానే వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

స్టాలిన్‌

Advertisement
 
Advertisement
Advertisement