రైల్వే మార్గం భూ సేకరణకు రూ. 1,800కోట్లు
సాక్షి, చైన్నె : అత్తి పట్టు– గుమ్మిడి పూండి రైల్వే మార్గం విస్తరణ పనులకోసం స్థల సేకరణ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఇందుకోసం రూ.1,800 కోట్ల కేటాయించారు. సెంట్రల్ నుంచి గుమ్మిడి పూండి మార్గంలో రైల్వే విస్తరణ కార్యాచరణపై దక్షిణ రైల్వే దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అత్తిపట్టు – గుమ్మిడి పూండి మార్గంలో పనులు చేపట్టేందుకు స్థల సేకరణ అవశ్యమైంది. ఇందుకోసం రూ.1,800 కోట్లతో స్థల సేకరణ పనులపై దృష్టి పెట్టారు.
ఘన నివాళి
స్వాతంత్య్రసమరయోధురాలు, వీర నారి వేలునాచ్చియార్ జయంతి సందర్భంగా చైన్నెలోని ఆమె విగ్రహానికి మంత్రులు ఎం. సుబ్రమణియన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ తదితరులు నివాళులర్పించారు. – సాక్షి, చైన్నె
చైన్నె వేదికగా
వైల్డ్ మిలన్ ఎగ్జిబిషన్
సాక్షి ,చైన్నె: ఫెస్టివ్ ఫ్లెయిర్ ఎడిట్ పేరుతో చైన్నె వేదికగా వైల్డ్ మిలన్ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. దీనిని ప్రముఖులు, విజయనగరం యువరాణి ముఖ్య అతిథి విద్యా సింగ్, సిరి చందన రెడ్డి ప్రారంభించారు. చైన్నె రాయపేటలోని ఫాలీ అమెథిస్ట్‌లో దీనిని ఏర్పాటుచేశారు. వైల్డ్ మిలన్ ఎగ్జిబిషన్ అనేది మహిళా వ్యవస్థాపకులు, స్వదేశీ బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి అంకితమైన ఓ క్యూరేటెడ్ ప్లాట్‌ఫామ్ అని సిరి చందన రెడ్డి తెలిపారు. చిన్న, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలకు, ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని వెంచర్లకు అవకాశాలను అందించే దృక్పథంతో వైల్డ్ మిలన్ ఎగ్జిబిషన్ గత నాలుగు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నామని వివరించారు. ఫెస్టివ్ ఫ్లెయిర్ ఎడిట్ దుస్తులు, ఆభరణాలు, ఉపకరణాలు, జీవనశైలి బ్రాండ్‌ల క్యూరేటెడ్ ఎంపికను ప్రదర్శిస్తుందని, సందర్శకులకు ఉత్సాహభరితమైన పండుగ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.
వేడుక
పెరుంతలైవర్ మక్కల్ కట్చి అధినేత ఎన్‌ఆర్ ధనపాలన్ జన్మదిన వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా తమిల మానిల కాంగ్రెస్ తరపున ఆపార్టీ ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్, నేతలు రాజం ఎంపీ నాథన్, సంపత్, రఘు తదితరులు ఎన్‌ఆర్ ధనపాలన్‌ను సత్కరించారు. – సాక్షి, చైన్నె
రూ. 12.50 లక్షల జరిమానా
అన్నానగర్: గత వారం రోజులుగా తమిళనాడు అంతటా నిర్వహించిన వరుస దాడుల్లో 15.56 టన్నుల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, రూ.12.50 లక్షల జరిమానా విధించారు. ఈ విషయంలో తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. పండుగ సీజన్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని నిర్ధారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్‌ను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 9,248 దుకాణాలలో తనిఖీలు నిర్వహించగా అందులో 2,553 ఉల్లంఘనలను గుర్తించి, 15.56 టన్నుల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై రూ. 12.50 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తిరువొత్తియూరు: పొంగల్ పండుగను పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. సొంత ఊరికి వెళ్లడానికి 2 నెలల ముందే వెళ్లడానికి చాలా మంది రైళ్లకు రిజర్వేజన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దక్షిణ జిల్లాలకు వెళ్లే అన్ని రైళ్లలో రిజర్వేషన్‌కు వెయిటింగ్ లిస్ట్ పెరిగాయి. ఈక్రమంలో దక్షిణ రైల్వే 10 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు శనివారం ప్రకటించింది. పొంగల్ పండుగ రద్దీని తట్టుకునేందుకు చైన్నె, తాంబరం నుంచి రైళ్లు నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే మార్గం భూ సేకరణకు రూ. 1,800కోట్లు


