ఐసీయూ స్థాయి సేవలతో అంబులెన్స్
సాక్షి, చైన్నె : అత్యవసర సేవలలో భాగంగా గుండె, ఊపిరితిత్తుల సంరక్షణే లక్ష్యంగా ఐసీయూ స్థాయి వసతులు, సేవలతో ప్రత్యేకంగా మొబైల్ అంబులెన్స్‌ను ఎంజీఎం హెల్త్‌కేర్ రంగంలోకి దించింది. ఈ మొబైల్ యూనిట్‌ను అన్నా నగర్‌ఎమ్మెల్యే ఎంకే మోహన్, అసిస్టెంట్ కమిషనర్ పీకే రవి, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, కో– డైరెక్టర్ సురేష్ రావు, క్లినికల్ డైరెక్టర్ సేనాతి నందకిషోర్, అలర్ట్ ఫౌండేషన్ ట్రస్టీ రాజేష్‌లు జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. ఇందులో ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రెన్ ఆక్సిజనేషన్(ఎక్మో) పరికరం, క్రిటికెల్ కేర్ పరికరాలు, ప్రత్యేక బృందం, ఆన్ సైట్ ప్రాణ రక్షణ చికిత్సకు ఉపయోగ పడే అన్ని రకాల వసతులు కల్పించారు. ఇది మొబైల్ ఐసీయూస్థాయిలో అంశాలతో ఉండటం విశేషం. అత్యవసర పరిస్థితులలో ఉన్న రోగులు ఆస్పత్రికి వచ్చేలోపు వారికి కావాల్సిన చికిత్సలను అందించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలను కల్పించామని వైద్యబృందం పేర్కొంది.
ఆరో రోజూ అవస్థలే..!
– ఇండిగో విమాన సేవల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
సాక్షి, చైన్నె : ఇండిగో విమాన సేవలకు సంబంధించి ఆరోరోజూ సైతం సమస్య ఎదురు కావడంతో ప్రయాణికులలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. సరైన సమాధానం ఇవ్వని సిబ్బందిపై తీవ్ర స్థాయిలో రుసరుస లాడారు. దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు బుధవారం నుంచి అనేకం రద్దు అవుతున్న విషయం తెలిసిందే. గురువారం చైన్నెలో 39 విమానాల సేవలు రద్దు అయ్యాయి. శుక్రవారం మరో 69 విమానాలసేవలు రద్దు అయ్యాయి. శనివారం ఇతర నగరాలకు విమానా సేవలు కరువైనా, తమిళనాడులోని ప్రధాన నగరాలకు కాస్త సౌకర్యం కలిగింది. ఇండిగో సేవల రద్దుతో ఐదు రోజులుగా చైన్నె, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తూత్తుకుడి విమానాశ్రయాలలో ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయడం కష్టతరంగామారింది. ఈ విమానాలలో ముందస్తుగా రిజర్వు చేసుకున్న వారు తమ ఆగ్రహాన్ని అక్కడి సిబ్బందిపై ప్రదర్శిస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రయాణానికి తదుపరి తేదీలను నిర్ణయించినా, అందుకు సంబంధించిన విమాన సర్వీసులు చైన్నె తదితర తమిళనాడులోని నగరాల నుంచి లేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం రాక పోకలతో కలుపుకుని వంద విమాన సర్వీసుల సేవలు రద్దు అయ్యాయి. ఇతర విమానాలలో టికెట్ల ధరలు మూడింతలు అధికంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. విమానాల కోసం గంటలు, రోజు తరబడి విమానాశ్రయంలో పడిగాపు కాయాల్సి ఉందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన 35 మంది ఉపాధ్యాయులు ఢిల్లీ పర్యటన నిమిత్తం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా, విమాన సేవ లేకపోవడంతో చైన్నె విమానాశ్రయం ఆవరణలో తమ ఆగ్రహాన్ని అక్కడి సిబ్బందిపై వ్యక్తం చేశారు.
మెట్రో వాటర్‌కు చార్జీల పెంపు
– ఆరు సంవత్సరాల తర్వాత వడ్డన
సాక్షి, చైన్నె: మెట్రో వాటార్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి ధరలు పెరిగాయి. ఆరు సంవత్సరాల తర్వాత తాజాగా చార్జీలను పెంచుతూ చర్య లు తీసుకున్నారు. మెట్రో వాటర్ బోర్డు ద్వారా వందలాది ట్యాంకర్ల ద్వారా నగరంలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలలో కార్పొరేషన్ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. అ దే సమయంలో ప్రైవేటు సంస్థలు, కార్యాలయా లు, హోటళ్లు , బహుళ అంతస్తుల భవనాలు.. ఇ లా అనేక చోట్ల మెట్రో వాటర్‌ను గృహ అవసరా లు, వర్తక రీత్యా తక్కువ రుసుంతో పంపిణీ చేయ డం జరుగుతూ వస్తోంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చుల దృష్ట్యా,తాజా గా చార్జీలను పెంచుతూ ఆదివారం మెట్రో వాటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఈ మేరకు 6 కిలో క్యాపాసిటీ ట్యాంకర్లకు రూ. 550, 9 కిలో లీటర్ల ట్యాంకర్లకు రూ. 825గా నిర్ణయించారు.12 కిలో లీటర్లకు డొమాస్టిక్ (గృహ అవసరాలు)కు రూ. 1,100, వర్తక రీత్యా రూ. 2,050, 18 కిలో లీటర్లకు డొమోస్టిక్ రూ. 1,650, వర్తక రీత్య రూ. 3070గా చార్జీని నిర్ణయించారు. కాగా, వర్తక, డమోస్టిక్ రూపంలో రోజుకు 450 ట్యాంకర్ల ద్వారా 3,500 నుంచి 3,900 ట్రిప్పులు ప్రతి రోజూ నీటిని తరలిస్తూ వస్తుండడం గమనార్హం.
ఐసీయూ స్థాయి సేవలతో అంబులెన్స్
ఐసీయూ స్థాయి సేవలతో అంబులెన్స్


