వైఎస్ జార్జిరెడ్డికి ఘన నివాళి
అనాథ ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు, వృద్ధాశ్రమంలో నివాళులు
– చైన్నెలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ జార్జిరెడ్డికి చైన్నెలో ఆదివారం వైస్సార్ సీపీ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జకీర్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, సేవాదళ్ వర్గాలు ఘన నివాళులర్పించాయి. పలు చోట్ల అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. వివరాలు.. వైఎస్ జార్జిరెడ్డి దివంగతులై ఆదివారంతో 26 ఏళ్లు అవుతోంది. ఆయన వర్ధంతి సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలకు సేవాదళ్ వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జకీర్‌హుస్సేన్ నేతృత్వంలో ఉదయాన్నే చైన్నె వ్యాసార్పాడిలోని డాన్ బాస్కో వృద్ధుల ఆశ్రమం, అనాథల ఇల్లంలో అల్పాహారం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడి వృద్ధులు, పిల్లలకు కావాల్సిన వస్తువులను అందజేశారు. ముందుగా జార్జి రెడ్డి చిత్ర పటం వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక్కడి వృద్ధులు, పిల్లలు , పార్టీ వర్గాలు జార్జిరెడ్డి చిత్ర పటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. రాత్రి ఇక్కడి అనాథ పిల్లల ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సేవాదళ్ అధికారిక ప్రతినిధి కృతిక, నాయకులు సంపత్, ప్రకాష్, రాజేష్, అరుల్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జార్జిరెడ్డికి ఘన నివాళి


