ఒకే వేదికపైకి వేలాది మంది రన్నర్లు
విజేతను సత్కరిస్తున్న కమల్
పరుగు పందేలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్
– చైన్నెలో పరుగు పందెం
సాక్షి, చైన్నె : ఎంఆర్‌టీ – 1 చార్జ్‌బీ చైన్నె పరుగు పందెంతో వేలాదిమంది రన్నర్‌లు ఆదివారం ఒకే వేదికపైకి వచ్చారు. ఈ రన్‌ను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించగా, విజేతలను మక్కల్ నీది మయ్యంనేత, రాజ్య సభ సభ్యుడు, సినీ నటుడు కమలహాసన్ సత్కరించారు. ఛార్జ్‌బీ చైన్నె రన్స్ 2025 పేరిట ఫిట్ నెస్,కమ్యూనిటీ, క్రీడా, మారథాన్ స్పూర్తితో నిధుల సేకరణ ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 కి.మీ, 5కి.మీ, 10 కి.మీ, హాఫ్ మారథాన్ విభాగాలతో ఛార్జ్ బీ చైన్నె రన్స్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం, క్రీడల మంది ఉదయనిధి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరుగు పందెంలో పాల్గొనే వారిని ప్రోత్సహిస్తూ, తన మద్దతును తెలియజేశారు. చైన్నె రన్స్ క్రీడలు, సమష్టి పురోగతిని ఎలా ప్రేరేపిస్తాయో చాటిందన్నారు. పరుగుతో ఫిట్ నెస్‌ను ప్రోత్సహించడమే కాదు, తదుపరి తరానికి బలమైన, మరింత సాధికారతను ఆరోగ్య పరంగా కల్పించేందుకు వీలుంటుందన్నారు. ఈ రన్‌లో విజేతలుగా నిలిచిన వారిని పద్మభూషన్ కమలహాసన్,ఎంఆర్‌టీ – 1 చైర్మన్ బాలకృష్ణలు సత్కరించారు. ఈ పరుగు పందెంతో 12 వేల మందికి పైగా రన్నర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్టు బాలకృష్ణ పేర్కొన్నారు.
ఒకే వేదికపైకి వేలాది మంది రన్నర్లు


