100 సవర్ల నగలు చోరీ
డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో..
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు
పళ్ళిపట్టు: డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో చొరబడి 100 సవర్ల నగలు, కేజీ వెండి. రూ. లక్ష నగదు చోరీ ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కర్లంబాక్కం గ్రామానికి చెందిన పళని(65) డాక్యుమెంట్ రైటర్‌తో పాటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు డాక్టర్‌గా హైదరాబాదులో కుటుంబంతో నివాసముంటున్నారు. కూతురు ఆంధ్రాలోని పుత్తూరులో వుంటున్నారు. ఈక్రమంలో గ్రామంలోని ఇంట్లో పళని అతని భార్య రజిని మాత్రమే వుండేవారు. కూతురు వద్దకు మూడు రోజుల కిందట గ్రామంలోని ఇంటిని తాళం వేసుకుని పళని అతని భార్య వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున పళని ఇంటి నుంచి శబ్దం రావడంతో ఎదురింటికి చెందిన వారు వీధికి వచ్చి చూడగా పళని ఇంటి ముందు తలుపు తెరిచి వుండడంతో పళనికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు. పళ్లిపట్టు పోలీసులతో పాటు డీఎస్పీ కందన్ సంఘటన ప్రాంతం చేరుకున్నారు. పుత్తూరు నుంచి పళని గ్రామానికి చేరుకుని ఇంట్లో చూడగా బీరువా కూల్చివేతను చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసుల విచారణలో తన కుమారిడి వివాహం ఏడాదిన్న కిందట జరిగిందని తన కోడలకు వారి తల్లిదండ్రులు 60 సవర్ల నగలు వేసినట్లు ఆ నగలతో పాటూ మొత్తంగా వంద సవర్లు, కేజీ వెండీ రూ. లక్ష బీరువాలో వుంచినట్లు తెలిపారు. దీంతో వేలిముద్ర నిపుణులు వచ్చి ఆదారాలు సేకరించారు.
13 సవర్లకు కేసు నమోదు వంద సవర్లు నగలు చోరీకి సంబంధించి పోలీసులు రసీదులు కోరగా 13 సవర్లకు మాత్రమే చూపడంతో ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. వంద సవర్లకు రసీదు చూపితే కేసు మార్చి నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గ్రామంలోని ఇంట్లో చోరబడి భారీ మొత్తంలో నగలు నగదు చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
100 సవర్ల నగలు చోరీ


