
7వ తేదీ నుంచి లవ్ రిటర్న్స్
తమిళసినిమా: ఇటీవల సినిమాలతో పాటూ వెబ్ సిరీస్‌ల నిర్మాణం కూడా అవుతోందనే చెప్పాలి. కారణం వెబ్ సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటమే. దీంతో పలు నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ పై చూపుతున్నాయి. అలా తాజాగా ఆడియో సంస్థ సరిగమ సంస్థ కూడా వెబ్ సిరీస్ పై దృష్టి సారించింది ఇప్పటివరకు టీవీ సీరియల్స్‌ను, లఘు చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ తాజాగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి వెబ్ సిరీస్‌ను రూపొందిస్తుంది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా లవ్ రిటర్న్‌్‌స్ అనే వెబ్ సిరీస్ రూపొందించింది. భార్య, మాజీ ప్రేయసి ఓకే కార్యాలయంలో పనిచేస్తే, ఆ మాజీ ప్రేయసి ఇంటికి వస్తే ఆ యువకుడి పరిస్థితి ఏమిటి..? జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి వంటి పలు ఆసక్తికరమైన అంచనాతో రూపొందిన వెబ్‌సిరీస్ లవ్ రిటర్న్స్‌్. 12 ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ వినోదంతో కూడిన జనరంజకమైన వెబ్ సిరీస్ 7వ తేదీ నుంచి సరిగమ డైష్ టీవీ షోస్ తమిళ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ కానుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో మాజీ ప్రేయసిగా కయల్ వెబ్ సిరీస్ ఫేమ్ చైత్రారెడ్డి, భార్యగా కణాకానుం కాలంగళ్ ఫేమ్ ప్రవీణ, వీరిద్దరి మధ్య చిక్కి అవస్థలు పడే భర్తగా నటుడు గురు లక్ష్మణ్ నటించారు. సరిగమ సంస్థ ద్వారా ప్రిన్స్ ఇమానువేలు నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు సదాశివం సెంథిల్ రాజన్, అర్జున్ డీవీ కలిసి దర్శకత్వం వహించారు.