
రీఛార్జ్ అయిన మిల్కీబ్యూటీ
తమిళసినిమా: కుర్రకారు హార్ట్ బీట్ పెంచే అందం నటి తమన్నాది. అలా రెండు దశాబ్దాల పాటు వారిని తన అందచందాలతో ఉర్రూత లూగించిన ఈ మిల్కీ బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ నటులందరితోనూ నటించారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక పాటలతో కదం తొక్కిన తమన్నా అలాంటి పాటలకు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం మూడున్నర దశాబ్దాల వయసులోకి అడుగుపెట్టిన తమన్నా ఆమధ్య లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి నటించిన రొమాంటిక్ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే అదే సమయంలో నటి తమన్నాకు నటుడు విజయ్ వర్మకు మధ్య సాన్నిహిత్యం ప్రేమగా మారిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దాన్ని బలపరిచే విధంగానే తమన్న విజయవర్మలో సినీ వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి వెళ్లిన దృశ్యాలు మీడియా దృష్టిని దాటి వెళ్లలేకపోయాయి. దీంతో తమన్నా నటుడు విజయవర్మతో పెళ్లికి సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా కూడా హోరెత్తింది. అలాంటిది ఏం జరిగిందో ఏమో కానీ తమన్నా , విజయ్ వర్మల మధ్య దూరం పెరిగింది. వీరి ప్రేమకు ముసలం పట్టిందని ప్రచారం జరిగింది. మరొక విషయం ఏమిటంటే పెళ్లికి సిద్ధమైన తమన్నా తన అందంపై శ్రద్ధ తగ్గించడంతో కాస్త బరువు పెరిగారు. అదే సమయంలో గట్టిగా అవకాశాలు తగ్గిపోయాయి. కాగా తాజాగా ప్రేమ పెళ్లి విషయాలను పక్కనపెట్టిన తమన్న మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారనిపిస్తోంది. కారణం ఆ మధ్య కాస్త బరువు పెరిగిన ఈ బ్యూటీ మళ్లీ డైటింగ్, కసరత్తు లాంటివి చేసి సన్నపడటమే. అలా మళ్లీ మెరుపుతీగలా మారిన తమన్నా ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకొని తీర్చుకున్న అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ నటిగా మరో రౌండ్ కొడతారేమో చూడాలి.