
దంతాలను అమర్చే విధానాల్లో విప్లవాత్మక మార్పులు
కొరుక్కుపేట: దంత వైద్యంలో ప్రస్తుతం కృత్రిమ దంతాలను అమర్చుకోవడంపై ప్రజలలో ఆసక్తి అధికమైందని, ఈ దంతాలను అమర్చే విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేస కుంటున్నాయని అంతర్జాతీయ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటోలజిస్ట్స్ (ఐఏఓఐ) అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును తమిళనాడు డాక్టర్ ఎంజీ వైద్యవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నారాయణస్వామి ప్రారంభించారు. శ్రీలంక ఆరోగ్యవిభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చందన గజనాయికే. రాగాస్ డెంటల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ కనకరాజ్. డాక్టర్ శివశంకర్, డాక్టర్ జాన్సన్ రాజా జేమ్స్, డాక్టర్ జాన్ నేసన్, డాక్టర్ థ్యానేశ్వరన్ ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ అసలైన దంతాలతో పోటీపడే రీతిలో కృత్రిమ దంతాలను అమర్చటం కూడా ఓ అందమైన కళేనని చెప్పారు. దేశవిదేశాల నుంచి 400 మంది కృత్రిమ దంతాలను అమర్చే చికిత్సకు సంబంధించిన వైద్యనిపుణులు హాజరయ్యారు.