
తుపాకీ షూటింగ్‌లో పోలీసులకు పతకాలు
తిరువళ్లూరు: తమిళనాడు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేర్వేరు విభాగం షూటింగ్ పోటీల్లో ఆవడి పోలీసులకు పది బంగారు పతకాలు, రెండు కప్పులను గెలిచి సత్తా చాటారు. తమిళనాడు పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో మహిళ, పురుష పోలీసులకు వేర్వేరు విభాగాల్లో షూటింగ్ పోటీలు నిర్వహించారు. జూలై 27నుంచి 26 వరకు చెంగల్పట్టు ఒత్తివాక్కంలో జరిగిన పోటీల్లో పిస్టల్, స్టెన్‌గన్ తదితర 13 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో ఆవడి కమిషనరేట్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెండి పతకం, తిరునిండ్రవూర్ ఎస్‌ఐ సుధ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాదించారు. మొత్తానికి ఆవడి పోలీసు కమిషరేట్ పరిధిలోని పోలీసులకు పది పతకాలు, రెండు కప్పులను సాధించి తమ సత్తాను చాటారు. పతకాలు సాధించిన వారిని ఆవడి కమిషనర్ శంకర్ అభినందించారు.