హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ | - | Sakshi
Sakshi News home page

హీరోగా లోకేష్‌ కనకరాజ్‌

Jun 15 2025 8:07 AM | Updated on Jun 15 2025 8:07 AM

హీరోగ

హీరోగా లోకేష్‌ కనకరాజ్‌

తమిళసినిమా: దర్శకుడుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న లోకేష్‌ కనకరాజ్‌ ఇటీవల నిర్మాత గానూ అవతరమెత్తి చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈయన రాఘవ లారెన్‌న్స్‌ కథానాయకుడిగా బెంచ్‌ అనే చిత్రాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రాన్ని పూర్తి చేశారు. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. షూటింగ్‌ను పూర్తిచేసుకుని ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తర్వాత లోకేష్‌ కనకరాజ్‌, కార్తీ హీరోగా ఖైదీ–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది పూర్తిగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, దీనికి ఇంతకుముందు ధనుష్‌ హీరోగా కెప్టెన్‌ మిల్లర్‌ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈచిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాముఖ్యత ఉండడంతో, అందుకు న్యాయం చేయడానికి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

లోకేష్‌ కనకరాజ్‌

హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ 1
1/1

హీరోగా లోకేష్‌ కనకరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement