నిఘా నీడలో గ్రూప్ –1 పరీక్ష
●2.27 లక్షల మంది హాజరు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 1, 1ఏ పోస్టుల భర్తీ నిమిత్తం నిఘా నీడలో పరీక్ష జరిగింది. 2.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 70 గ్రూప్ 1, 1ఏ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 28 డిప్యూటీ కలెక్టర్, ఏడు డీఎస్పీ, 19 అసిస్టెంట్‌కమిషనర్ తదితర పోస్టులున్నాయి. పీజీ, యూజీ పూర్తి చేసిన అభ్యర్థులు 2.49 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 2 లక్షల 27 వేల 982 మంది పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్షల కోసం 44 ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకే ఆయా సెంటర్ల వద్దకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. చైన్నెలో 41 వేల మంది పరీక్ష రాశారు. సుమారు 17 సెంటర్లలో పరీక్ష జరిగింది. చైన్నెలోని పరీక్ష కేంద్రాలను టీఎన్‌పీఎస్సీ చైర్మన్ ఎస్‌కే ప్రభాకర్ తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మా ట్లాడుతూ, గ్రూప్ 1, 1ఏ ఫలితాలను రెండు నెలల విడుదల చేసి, మూడో నెల మెయిన్స్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టీఎన్‌పీఎస్సీ ద్వారా 10,227 పోస్టులను భర్తీ చేశామన్నారు. మరో 12,231 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటన్నామన్నారు. ఎలాంటి అవకతకవలకు ఆస్కారం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ పరీక్షలు జరిగినట్టు పేర్కొన్నారు.
నిఘా నీడలో గ్రూప్ –1 పరీక్ష


