గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి:గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి అగరాల సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 ఏళ్లు కలిగిన, తెలుపు, నీలం రంగు చారల చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో చిత్తూరు నుంచి తిరుపతికి వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల తెలిసిన వారు చంద్రగిరి పోలీసు 9440796760, 76718 45685 నంబర్లను సంప్రదించాలన్నారు.


