కళలపై అభిరుచి పెంచుకోవాలి
కొరుక్కుపేట: భారతీయ కళలపై అభిరుచిని పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తమిళ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో చైన్నె ఆర్‌ఏపురంలోని ఇమేజ్ ఆడిటోరియం వేదికగా 30వ వార్షిక మెగా సంగీతోత్సవాలను శనివారం రాత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భరతనాట్య కారిణి కలైమామణి పార్వతి రవి ఘంటసాలకు జీవిత సాఫల్య పురస్కారం ,ప్రముఖ వీణా కళాకారుడు రాజేష్ వైద్యకు ప్రతిష్టాత్మక ఇసై చెమ్మల్ అవార్డును అందజేశారు. తమిళ్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకుడు జగన్నాథన్ ఆరోగ్యరాజ్, ప్రెసిడెంట్ వి. ఇళయరాజా గల్స్ రిజన్ ప్రెసిడెంట్ మహ్మద్ రియాజుద్దీన్, కార్యదర్శి కుమరేషన్, వైస్ ప్రెసిడెంట్ ఎం.జె.శేఖర్ , నాట్యగురు రోజారాణి, దుర్గ పాల్గొన్నారు. తమిళ్ కల్చరల్ అకాడమీ సేవలను ముందుగా కొనియాడుతూ వెంకయ్య నాయుడు మాట్లాడారు. ప్రతిఒక్కరూ వారి వారి మాతృభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు గురువు రోజారాణి సారథ్యంలో వారి శిష్య బృందం నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
కళలపై అభిరుచి పెంచుకోవాలి


