క్రైస్తవులకు సంక్షేమాల పంపిణీ
వేలూరు: రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజుతోపాటు క్రిస్మస్ పండుగ రానున్న నేపథ్యంలో వేలూరులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో క్రైస్తవులకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేయడంతోపాటు కేక్‌ను కట్ చేసి క్రైస్తవులకు పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ మతాలకు అతీతీంగా నిరుపేదలను ఆదుకోవడంలో తమ పార్టీ ఎన్నటికీ ముందుంటుందన్నారు. వేలూరు నియోజకవర్గంలో ఎక్కువగా క్రైస్తవులున్నారని వారందరికీ సంక్షేమ పథకాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 1,049 మందికి రూ.12 లక్షలు విలువ చేసే పథకాలతోపాటు రూ.200 నగదును అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ వేలూరు డయాసిస్ బిషఫ్ శర్మ నిత్యానందం, మేయర్ సుజాత, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, కార్పొరేటర్లు మురుగన్, ఏలుమలై, చక్రవర్తి, షణ్మగం, జయశంకర్ పాల్గొన్నారు.


