ఆగకడవన!
మహిళా తారలు లేకుండా
కమలహాసన్‌తో అన్బరివ్‌ల ద్వయం
తమిళసినిమా: సినిమా అనగానే నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్, రొమాన్స్, కామెడీ వంటి అంశాలు తప్పకుండా ఉండాలి. అప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సినిమా ట్రెండ్ మారిపోతోంది. కొత్త టాలెంట్ డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. సినిమా ఇలానే ఉండాలి అనేదాన్ని బ్రేక్ చేస్తున్నారు. అలా సరికొత్త పంథాలో తెరకెక్కిన చిత్రం ఆగకడవన. చిత్ర టైటిలే కొత్తగా ఉంది కదూ. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కథానాయకి ఉండదు. పాటలు ఉండవు. వినోదం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో మహిళా తారలే లేరు. అయితే కథ, కథఽనాలు ఆసక్తిగా సాగుతాయి. ఇలా మూస ఫార్ములాను బ్రేక్ చేసి తెరకెక్కించిన చిత్రం ఆగకడవన. ఇది ప్రపంచ విధి అన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. ముగ్గురు స్నేహితులు స్వయంకృషితో ఎదగాలనే ప్రయత్నంతో ఒక మెడికల్ షాప్‌ను నిర్వహించడానికి సిద్ధం అవుతారు. అయితే అందకు సిద్ధం చేసుకున్న డబ్బు చోరీకి గురవుతుంది. దీంతో మరో ప్రయత్నంగా అమ్మ నాన్న, కుటుంబ సభ్యుల సాయం కోసం సొంత ఊరికి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రం కథ. చిత్రం ఆధ్యంతం యథార్థాన్ని మీర కుండా సాగుతుంది. సారా కలైకూడమ్ పతాకంపై అనిత లియో, లియో వి.రాజా నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటుడు ఆదిరన్ సురేశ్, విన్సెంట్ ఎస్.సీఆర్.రాహుల్, మైఖెల్ ఎస్. సతీశ్ రామదాస్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రానికి చాయాగ్రహణం లియో వి.రాజా, సంగీతాన్ని శాంతన్ అనే బజగనే అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.


