అయర్టన్ చెన్నాకు అజిత్ నివాళి
తమిళసినిమా: నటుడు అజిత్ ప్రస్తుతం కార్ రేస్‌లపై పూర్తిగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. అలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఈయన ఇటీవల అంతర్జాతీయ స్థాయి కార్ రేసుల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. కార్ రేస్ అన్నది తను చిన్ననాటి కల అని ఇటీవల పేర్కొన్నారు. కాగా అజిత్ ఇటీవల బ్రెజిల్ దేశానికి చెందిన దివంగత ప్రఖ్యాత ఫొర్ములా 1 కారు రేస్ క్రీడాకారుడు అయర్టన్ చెన్నా స్మారక చిహ్నన్ని సందర్శించి ఆ శిలా విగ్రహం పాదాలను స్పృశించి అభివందనం చేశారు. అయర్టన్ చెన్నా 1988, 1990, 1991 ప్రాంతంలో ఫార్ములా 1 కార్ రేస్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించారు. అదేవిధంగా 1994లో శాన్ మరినో గ్రాండ్ ప్రియల్ విలియమ్స్ జట్టు కోసం ఆడి ప్రమాదవశాత్తు 34 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం బ్రెజిల్ లో పేద విద్యార్థుల విద్య కోసం చెన్నా పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు.


