ఘనంగా అగ్నిగుండ ప్రవేశం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిలోని ద్రౌపదీదేవి ఆలయంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం గ్రామాలు సంయుక్తంగా ఏటా మహాభారత యజ్ఞం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గత 9వ తేదీ నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రోజూ మహాభారత హరికథాగానం, రాత్రి వీధి నాటకాలు ప్రదర్శించారు. ఆదివారం 500 మంది భక్తులు కంకణాలు ధరించి, అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగారు. సోమవారం ఉదయం ధర్మరాజుల పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాకర్లపూడి వెంకటరమణరాజు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఘనంగా అగ్నిగుండ ప్రవేశం


