క్రీడాకారులకు ప్రోత్సాహం!
● కాలేజ్ డ్రీమ్ ప్రోగ్రామ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: జర్మనీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికై న 12 మంది క్రీడకారులకు తమిళనాడు చాంపియన్స్ ఫౌండేషన్ నుంచి డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ నగదు ప్రోత్సహం అందజేశారు. తమిళనాడు చాంపియనన్స్ ఫౌండేషన్‌న్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. వివిధ దేశాలు, ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఖర్చుల నిమిత్తం నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. క్రీడాకారులకు అవసరమయ్యే క్రీడాపరికరాలను అందజేస్తున్నారు. ఈ పరిస్థితులలో జర్మనీలో ఈనెల 16 నుంచి జూలై 27 వరకు జరగనున్న యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొనే తమిళనాడుకు చెందిన అథ్లెట్ ఏంజెల్ సిల్వియా, ఆటగాళ్లు జెరోమ్, అశ్విన్‌కృష్ణన్, రీగన్, బాస్కెట్‌బాల్ ప్లేయర్ సంగీత్‌కుమార్, అథ్లెట్ తేజశ్రీ, సుగంధన్, వాలీబాల్ క్రీడాకారులు ఆనంది, సుజీ, కనిమొళి, అథ్లెట్ అభితాన్, ఫెన్సింగ్ అథ్లెట్ కనకలక్ష్మి ఎంపికయ్యారు. వీరికి ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రూ.32.25 లక్షల చెక్కును అందజేశారు. అలాగే, తమిళనాడు చాంపియన్స్ ఫౌండేషన్ ఫండ్ నుంచి స్విమ్మర్ కామిని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జానాక్షి, అథ్లెట్ వాసన్, యుగేంద్రన్, శ్వేత, రేష్మ, క్యారమ్ క్రీడాకారులు హరిణి, కావ్యలకు రూ.4.80 లక్షల విలువ కలిగిన క్రీడా పరికరణాలను ఈసందర్భంగా అందజేశారు. క్రీడల కార్యదర్శి అతుల్యమిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డి పాల్గొన్నారు.
కాలేజ్ డ్రీమ్:
నాన్ మొదల్వన్ పథకం కింద ఉన్నత విద్య మార్గదర్శకత్వానికి అర్హులుగా కాలేజ్ డ్రీమ్ 2025 కార్యక్రమం కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగింది. ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, బ్యాంకింగ్ పరీక్షల్లో నాన్ మొదల్వన్ పథకం ద్వారా విజయం సాధించిన 58 మంది విద్యార్థులను కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సత్కరించారు. ఉదయనిధి మాట్లాడుతూ కాలేజ్ డ్రీమ్ – 2025 ప్రాజెక్ట్, నాన్ మొదల్వన్ పథకం సీఎం స్టాలిన్ కలల పథకాలు అని గుర్తుచేశారు. ఉన్నత విద్యను విద్యార్థులకు దరిచేర్చే విధంగా, శిక్షణ, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఈ పథకం దోహద పడుతుందన్నారు. నేడు కళాశాలలకు వెళ్తున్నవారి సంఖ్య పెరిగిందని, విద్యాపరంగా విద్యాలోకానికి సంపూర్ణ మద్దతు, సహకారం అందించేందుకు ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ ఎ ల్లప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాలేజ్ డ్రీమ్ ప్రొగ్రామ్ ద్వారా విద్యార్థులు మరిన్ని విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం!


