త్రిష
తమిళసినిమా: నటి త్రిష సెకండ్ ఇన్నింగ్ టాప్‌గేర్‌లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇదంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పక తప్పదు. ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంతోనే త్రిష సెకండ్ ఇన్నింగ్ మొదలైంది. ఇప్పుడు చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అన్ని ప్రముఖ స్టార్స్‌తో నటిస్తున్న భారీ చిత్రాలే కావడం విశేషం. నటుడు విజయ్‌తో జతకట్టిన లియో చిత్రం షూటింగ్‌పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమంలో ఉంది. తదుపరి త్రిష అజిత్‌కు జంటగా విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తరువాత మరోసారి మణిరత్నం, కమలహాసన్ కాంబోలో రూపొందనున్న భారీ చిత్రంలో నటించబోతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్న త్రిషకు మరోసారి బాలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చినట్లు సమాచారం. ఆమె సుమారు గత 13 ఏళ్ల క్రితం ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఖట్టా మిట్టాచిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సరసన నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మరోసారి ఈ బ్యూటీ పెళ్లి గురించి వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. చాలాకాలం క్రితమే అంటే 2015లోనే త్రిష పెళ్లి వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నాలుగు పదుల పరువాల సుందరి ఓ ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాతతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాలలో వైరల్‌వుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.


