రోడ్లు సరిగా లేక ఇబ్బందులు
త్వరలో మళ్లీ టెండర్లు పిలుస్తాం
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
డిగ్రీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ పలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్‌లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్‌లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్‌లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్‌లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్‌లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పడకేశాయి. మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదు. పట్టణంలో రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులకు ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసినా నేటికీ టెండర్లు ఖరారు కాక పోవడం విస్మయానికి గురి చేస్తున్నది. బిల్లులు సమయానికి రావేమోనన్న సందేహంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారే కానీ పనులు చేపట్టడంలో శ్రద్ధ వహించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల ఖరారులో జాప్యం
మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు జనవరిలో శంకుస్థాపన చేశారు. రూ.6 కోట్లతో మాలిపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, మరో రూ.6 కోట్లతో పలు వార్డులలో సీసీ రోడ్లు, రూ.3 కోట్లతో వివిధ కాలనీలలో సైడ్ డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయించారు. కాని నేటికీ ఆయా పనులకు టెండర్లు ఖరారు కాలేదు. పనులు చేస్తే బిల్లులు రావేమోనన్న సందేహమో, లేదా వేరే కారణమో తెలియదు కానీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టణాభివృద్ధి కింద తిరుమలగిరి మున్సిపాల్టికి రూ.15 కోట్లు మంజూరైనట్లు 8 నెలల క్రితం అధికారులు ప్రకటించారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు జనవరి 19న ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు చేయడానికి రోడ్లను శుభ్రం చేసి చదును కూడా చేశారు. ఆ తరువాత పనులు నిలిపివేశారు. దాంతో మున్సిపాలిటీ పరిధిలోని చాలా వార్డులలో రోడ్లు, సైడ్ డ్రెయిన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవడానికి టెక్నికల్ ఆమోదం కోసం ఉన్నతాధికారులకు పంపినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తున్నది.
ఫ ఆరు నెలల క్రితం
రూ.15 కోట్లతో శంకుస్థాపన
ఫ నేటికీ ఖరారు కాని టెండర్లు
ఫ రోడ్లు సరిగా లేక ప్రమాదాలు
ఫ వెంటనే పనులు ప్రారంభించాలని స్థానికుల వేడుకోలు
తిరుమలగిరి – తొర్రూరు ప్రధాన రహదారి నుంచి మాలిపురం చెరువు కట్ట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.6 కోట్లతో శంకుస్థాపన చేశారు. కాని పనులు చేపట్టలేదు. వివిధ గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే నిత్యం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి వచ్చి వెళుతుంటారు. రోడ్డు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి డబుల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి.
కేశిడి కవితారెడ్డి,
6వ వార్డు కౌన్సిలర్, మాలిపురం.
తిరుమలగిరి పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. వాటితో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించాం. కానీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదు. ఆయా పనులకు మళ్లీ టెండర్లు వేయడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అనుమతి రాగానే టెండర్లు పిలుస్తాం.
సీహెచ్.వెంకన్న,
మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి


