సర్‌ పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ పకడ్బందీగా చేపట్టాలి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

హుజూర్‌నగర్‌ : భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా ఉపకరణాలు, అలవెన్స్‌ అందిస్తారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌ రేణుక అన్నారు. గురువారం ఆమె హుజూర్‌ నగర్‌లోని భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఫిజియోథెరఫీ వంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు కావాల్సిన తర్ఫీదు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్‌, క్యాంప్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం జాని, ఫిజియోథెరఫిస్ట్‌ మీర, కేంద్రం నిర్వాహకులు శ్రీనివాస్‌, కేర్‌ వాలంటరీ నాగమణి, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తుంగతుర్తి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)ను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలో బీఎల్‌ఓలకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్స్‌ను ఆయన పంపిణీ చేశారు. ఈ నెల 25 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు కలిగిన వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దయానందం, ఎన్యూమరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో పూరిళ్లను గుర్తించాలి

గృహనిర్మాణశాఖ పీడీ సిద్ధార్థ

చిలుకూరు : గ్రామాల్లో పూరిళ్లలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి జాబితా రూపొందించాలని హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఇందిర్మ ఇళ్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, ఏఈ మూర్తి, ఏపీఓ వీరబాబు పాల్గొన్నారు.

భవిత కేంద్రాల ద్వారా ఉపకరణాలు

టీచర్లకు టెట్‌ నుంచి

మినహాయింపు ఇవ్వాలి

సూర్యాపేట : ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీయూఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి కోరారు. గురువారం ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి ఏఓ కె.శ్రీలతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 వరకు టెట్‌ ఉత్తీర్ణత సాధించేందుకు సుప్రీం కోర్టు గడువు విధించిందని, ఆలోగా టెట్‌ అర్హత సాధించని వారి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఉపేందర్‌, జితేందర్‌రెడ్డి, కోటిరెడ్డి ఉన్నారు.

మోస్తరు వర్షం

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు వర్షం పడింది. సరాసరిగా 10.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతగిరి మండలంలో 39.6, కోదాడ మండలంలో 23.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగారం మండలంలో 3.5, తిరుమలగిరిలో 7.9, తుంగతుర్తి 8.3, మద్దిరాల 2.5, నూతనకల్‌ 10.6, జాజిరెడ్డిగూడెం 13.5, సూర్యాపేట 0.3, ఆత్మకూర్‌ 11.5, మోతె 15.4, చివ్వెంల 3.9, పెన్‌ పహాడ్‌ 3.9, మునగాల 9.4, నడిగూడెం 14.4, చిలుకూరు 16.5, గరిడేపల్లి 4.9, నేరేడుచర్ల 1.3, మట్టంపల్లి 1.2, హుజూర్‌నగర్‌ 14.1, మేళ్లచెరువు 18.3 చింతలపాలెం 8.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. ఈ వర్షంతో ఇటీవల రైతులు వేసిన పత్తి, మెట్ట పంటల విత్తనాలు మొలకెత్తనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement