అధిక రసాయనాలతో భూమికి నష్టం | - | Sakshi
Sakshi News home page

అధిక రసాయనాలతో భూమికి నష్టం

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

మద్దిరాల : పంటలకు అత్యధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గి దిగుబడి తగ్గుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్త డి.నరేష్‌ తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తల సహకారంతో గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో నేల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనీషారూహి, ఏఈఓ అయేషా, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement