ఆర్–3 కాలువ లైనింగ్ పనులను పూర్తిచేసి కాలువ చివరి భూములకు నీరందేలా చూడాలి. కాలువకు మొదట్లో, చివర్లో మాత్రమే పనులు చేస్తున్నారు. పట్టణం గుండా వెళ్లే భాగంలో పనులు చేపట్టకపోతే నీరు ఎప్పటిలాగే వృథా అవుతుంది. అధికారులు స్పందించి పట్టణ పరిధిలోనూ పనులు చేపట్టాలి.
– మన్నెం గురువయ్య, రైతు, నేరేడుచర్ల
జాన్‌పహాడ్ మేజర్ కాలువ పరిధిలోని మేజర్, మైనర్ కాలువలకు లైనింగ్, మరమ్మతులు చేపడుతున్నాం. ఆర్–3 కాలువకు పట్టణ పరిధి మినహా మిగిలిన అన్ని చోట్లా లైనింగ్ పూర్తిచేస్తాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పట్టణ పరిధిలోనూ యుద్ధప్రాతిపదికన పనులు చేపడతాం.
– అమరేందర్‌రెడ్డి,
ఎన్‌ఎస్‌పీ డీఈఈ, నేరేడుచర్ల


