సూర్యాపేట : రైతులు, మహిళా సంఘాల అభ్యున్నతికి నాబార్డు నిరంతరం కృషి చేస్తోందని నాబార్డు తెలంగాణ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాబార్డు డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతలో నల్లగొండ క్లస్టర్ కింద ఉన్న సూర్యాపేటను.. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మార్చి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా నాబార్డు ప్రతినిధిగా డి.రవీందర్‌నాయక్‌ను నియమించినట్టు పేర్కొన్నారు. సూర్యాపేటలో ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డెయిరీ రంగాల్లో మూడు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ ప్రతినిధులు ఎల్.డి.ఎం నాగప్రసాద్ డీసీసీబీ సీఈఓ శంకర్‌రావు, టీజీబీ చీఫ్ మేనేజర్ అజయ్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ నరేష్, ఎన్జీఓ ప్రతినిధులు రమేష్, నిఖిల్ పాల్గొన్నారు.
ఫ నాబార్డు సీజీఎం ఉదయభాస్కర్


