చౌటపల్లి–అల్లీపురం రోడ్డు పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

చౌటపల్లి–అల్లీపురం రోడ్డు పనుల అడ్డగింత

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

మఠంపల్లి: మండలంలోని చౌటపల్లి నుంచి అల్లీపురం వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన బీటీరోడ్డు పనులను ఆదివారం చౌటపల్లిలో స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొద్ది వెడల్పు మాత్రమే ఉన్న డొంకదారిని రెండువైపులా ఉన్న రైతులను సంప్రదించకుండా సుమారు 36 అడుగుల వెడల్పు తవ్వుతూ భూములను ఆక్రమించి, భూముల్లో జేసీబీతో మట్టిని తవ్వుతున్నారని ఆరోపించారు. రోడ్డు వెడల్పును తగ్గించడంతోబాటు మా భూములకు నష్ట పరిహారం చెల్లించేదాక పనులను సాగనివ్వబోమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లు నాగిరెడ్డి, తొడేటి వీరనరసింహ, కుందూరు నరసింహారెడ్డి, సింహాద్రి, నరసయ్య, ఎరబోలు నాగిరెడ్డి, అచ్చిరెడ్డి, ఐతగాని శ్రీను, నరసింహారావు, సత్యనారాయణ, వీరయ్య, కాశయ్య, సామ్రాజ్యం, రామయ్య, వీరబాబు, కిట్టయ్య, మంగమ్మ,వెంకన్న, గోపయ్య, సోమయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, కొండలు తదితరులు పాల్గొన్నారు.

నష్ట పరిహారం చెల్లించేదాకా

పనులు సాగనివ్వం

చౌటపల్లిలో ఆందోళన చేపట్టిన రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement