విద్యార్థులు చెస్‌ పోటీల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు చెస్‌ పోటీల్లో రాణించాలి

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

సూర్యాపేట : హైదరాబాద్‌లోని నిజాంపేట్‌ రోడ్డు బాచుపల్లిలో ఎల్‌ఎస్‌కె చెస్‌ అకాడమీ, తెలంగాణ స్టేట్‌ చెస్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జూలై 11, 12 తేదీల్లో జరిగే మహా వీరచక్ర కల్నల్‌ సంతోష్‌ బాబు ఆల్‌ ఇండియా ఓపెన్‌ పిడే రేటెడ్‌ రాపిడ్‌ చెస్‌ పోటీల్లో విద్యార్థులు పాల్గొని సత్తాచాటాలని చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో తాము నిర్వహించే చెస్‌ పోటీల్లో పాల్గొని చాలామంది విద్యార్థులు విజేతలుగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలు ఇందిర, రవికుమార్‌, దీక్షిత్‌, జతిన్‌రెడ్డి, అఖిలేష్‌, చిద్విలాసినికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి సంతోష్‌, ట్రెజరర్‌ వెంకట మురళి, ఉపాధ్యక్షుడు సాయికుమార్‌, జాయింట్‌ సెక్రెటరీ లింగారెడ్డి, ఆర్గనైజర్‌ కోచ్‌ శ్రీనివాస రాజు, మనోజ్‌రెడ్డి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement