ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నియంత్రించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జూన్‌ 5న హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు జరిగే ర్యాలీ, ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం జిల్లా కేంద్రంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దాని సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ ఉమర్‌, ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, డీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పి.భిక్షం, నాయకులు బొల్లెద్దు వెంకటేశ్వరరావు, కొచ్చర్ల వేణు, మున్నూరు నాగన్న, నకిరేకంటి వెంకన్న, బి.దేవేందర్‌, ఎ.రాంసింగ్‌, బి.క్రాంతికుమార్‌, ఫజల్‌ అయూబ్‌ ఖాన్‌ , ఎండీ సాహెబ్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement