వంతెన కల.. నెరవేరుతున్న వేళ | - | Sakshi
Sakshi News home page

వంతెన కల.. నెరవేరుతున్న వేళ

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

మా కష్టాలు తీరుతాయి

గరిడేపల్లి : తాళ్ల మల్కాపురం పరిధిలోని ప్రజల వరద కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఇక్కడి పునాతన లోలెవల్‌ వంతెన స్థానంలో రూ.6.90 కోట్లతో నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను స్థానిక ప్రజలు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.6.90 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఏప్రిల్‌ నెలలో ప్రారంభమైన వంతెన పనులు త్వరలో పూర్తి కానున్నాయి.

తీరనున్న వరద కష్టాలు..

గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం పరిధిలో లోలెవల్‌ వంతెనపై నుంచి వర్షాకాలంలో స్వల్ప వర్షాలకే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కీతవారిగూడెం నుంచి మునగాల వరకు గల విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి కావడంతో.. వరదలు వచ్చినప్పుడల్లా రాకపోకలు నిలిచి పోతున్నాయి. దాంతో వెలిదండా, కొక్కిరేణి, కీతవారిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, రేగులగడ్డ తండా, రంగాపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల వరద కష్టాలు తీరనున్నాయి.

ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు

వారం రోజులుగా వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల వల్ల వాహనదారులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు వంతెన పక్కనే తాత్కాలికంగా అప్రోచ్‌ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం వాహనదారులు ఈ రోడ్డు ద్వారానే ప్రయాణిస్తున్నారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.

ఫ తాళ్లమల్కాపురంలో కొత్త వంతెన నిర్మాణం

ఫ రూ. 6.90 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

ఫ శరవేగంగా సాగుతున్న పనులు

పురాతనమైన వంతెన కావడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. మా ఇబ్బందులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే రూ.6.90 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. మా ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది.

– యమగాని సైదులు, తాళ్ల మల్కాపురం

Advertisement
 
Advertisement
Advertisement