ఉచిత విద్యుత్‌ ఎత్తివేసేందుకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌ ఎత్తివేసేందుకు కుట్ర

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణ రైతాంగానికి అందుతున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఆలోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ రైతుల ప్రయోజనార్ధం చేపట్టిన రైతుబంధు, ఉచిత విద్యుత్‌, ధాన్యానికి మద్దతు ధర వంటి వాటిని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మూడవ డిస్కం తీసుకొస్తామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ముందు చెప్పడం, వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదని ప్రభుత్వం చెప్పడం రైతులను నిలువునా మోసం చేసే ప్రయత్నమేనన్నారు. రైతుల పాలిట ఉరితా డుగా మారనున్న మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పార్టీ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఉప్పల ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

లింగయ్య యాదవ్‌

Advertisement
 
Advertisement
Advertisement