హోర్డింగుల జోరు.. జనం బేజారు | - | Sakshi
Sakshi News home page

హోర్డింగుల జోరు.. జనం బేజారు

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

ఆదాయ వనరుగా మార్చుకోవాలి

కోదాడ : అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, లైట్‌ బోర్డులు కోదాడ పట్టణవాసుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు గాలివానకు పక్కకు ఒరిగిపోయి రాత్రి సమయాల్లో డివైడర్‌ పక్కగా వెళుతున్న వారికి తగిలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎలాంటి అనుమతుల లేకుండా ఇష్టానుసారంగా వందల సంఖ్యలో డివైడర్ల మధ్య బోర్డులను ఏర్పాటు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా..

ప్రకటనల బోర్డులు, లైట్‌బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయాలంటే సదరు సంస్థలు మున్సిపాలిటీ అనుమతుల తీసుకోవడంతోపాటు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లో హోర్డింగులను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ధరలు నిర్ణయించి టెండర్ల ద్వారా వివిధ సంస్థలకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. ఈ విషయంలో కోదాడ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కనీస చొరవ తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. హోర్డింగులు పెట్టినవారి నుంచి రుసుము వసూలు చేస్తున్న దాఖలాలు లేవని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోదాడ పట్టణంలో డివైడర్‌లు కేవలం నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండడంతో వీటిమీద అదేస్ధాయిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గాలి వానలకు ఇవి ఏమాత్రం పక్కకు జరిగినా వాహనదారులకు తగులుతున్నాయి.

పుట్టిన రోజుల హడావుడి..

గతంలో కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో రాజకీయ నాయకుల, సినిమా హీరోల పుట్టిన రోజుల వేడుకల సమయంలో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసేవారు. ఇటీవల ప్రతిఒక్కరూ ఇలాంటి వేడుకల్లో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేస్తున్నవారిలో పలువురు పోకిరీలు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు చిత్రవిచిత్రమైన ఫోజులతో కటౌట్లు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్‌ అధికారులు స్పందించి ఫ్లెక్సీల ఏర్పాటులో కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఫ జనం ప్రాణాల మీదకు

తెస్తున్న హోర్డింగులు

ఫ గాలి దుమారానికి

ఒరుగుతున్న బోర్డులు

ఫ అధికారుల నిర్లక్ష్యం..

మున్సిపల్‌ ఆదాయానికి గండి

కోదాడ పట్టణంలో ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి. దీన్ని మున్సిపాలిటీ ఆదాయ వనరుగా మార్చుకోవాలి. పట్టణంలో డివైడర్ల మీద కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టర్‌లు అంటించడం సరికాదు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలకు, వివిధ సంస్థలకు కూడా బాధ్యత ఉండాలి.

–పందిరి నాగిరెడ్డి, విద్యావేత్త, కోదాడ

Advertisement
 
Advertisement
Advertisement