కొత్త పెన్షన్‌పై టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త పెన్షన్‌పై టెన్షన్‌

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

జిల్లాల్లో పింఛన్‌దారుల వివరాలు..

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పెన్షన్ల టెన్షన్‌ పట్టుకుంది. సుమారు ఐదేళ్లుగా కొత్త పెన్షన్ల ఊసు లేకపోవడంతో వేలాది మంది వీటికోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడైనా తమకు పెన్షన్‌ అందుతుందా.. లేదా అనే టెన్షన్‌ దరఖాస్తుదారుల్లో పట్టుకుంది. పెన్షన్‌ దరఖాస్తుదారులు వారికి కావాల్సిన కులం, ఆదాయం, ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పుల కోసం కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు.

2022లో చివరిసారిగా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా పెన్షన్లను మంజూరు చేసింది. నాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కొత్త పెన్షన్‌ మంజూరు కాలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులతోపాటు దివ్యాంగులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వితంతు పెన్షన్ల కోసం గ్రామాల్లో నాలుగేళ్లుగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవేకాకుండా ప్రజాపాలన సమయంలోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు రాగా.. వీటన్నింటిని ఆన్‌లైన్‌ చేసి వదిలేశారు. అనంతరం వితంతు పెన్షన్‌ కోసం దరఖాస్తులు ఇచ్చినా.. ఆన్‌లైన్‌ చేసే అవకాశం లేకపోవడంతో అధికారుల వద్దనే దరఖాస్తులు ఉండిపోయాయి.

నాలుగేళ్ల తర్వాత..

నాలుగేళ్ల తర్వాత కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన రావడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో చాలామంది వితంతు, వృద్ధాప్య, గీత కార్మిక, దివ్యాంగ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా కొందరు పైరవికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ వద్దకు వచ్చే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే వాటిని ఆన్‌లైన్‌ చేసే వెసులుబాటు లేదని చెబుతున్నారు.

ఫ నూతన పెన్షన్లు ఇస్తామని

ప్రభుత్వం ప్రకటన

ఫ గతంలో ఇచ్చిన దరఖాస్తులు

ఆన్‌లైన్‌ చేసిన అధికారులు

ఫ ధ్రువపత్రాల కోసం కార్యాలయాల వద్దకు కొత్త దరఖాస్తుదారుల పరుగులు

వృద్ధాప్య 53,205

దివ్యాంగులు 18,458

వితంతువులు 56,277

ఒంటరి మహిళలు 6795

చేనేత కార్మికులు 873

కల్లుగీత కార్మికులు 6,552

ఎయిడ్స్‌ బాధితులు 1205

ఫైలేరియా రోగులు 2109

డయాలసిస్‌ రోగులు 258

Advertisement
 
Advertisement
Advertisement