ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

జిల్లాలో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు

తిరుమలగిరి మండలంలో రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్య అందుతుంది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలి.

–ఐ.శాంతయ్య, మండల

విద్యాధికారి, తిరుమలగిరి

తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత సంవత్సరం 31 ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించగా.. కొత్తవాటితో కలుపుకుని మొత్తం 122 పాఠశాలలు కానున్నాయి. వచ్చేనెల 12వ తేదీ నుంచి జిల్లాలో కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య మరింత అందుబాటులోకి రానున్నది. ఈ పాఠశాలల్లో ఇన్‌ఫ్రాస్టక్చర్‌, ఫర్నీచర్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ ఆట వస్తువులు, పెయింటింగ్స్‌ వంటి ఏర్పాట్ల కోసం ప్రతి పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు కేటాయించనున్నారు.

ఒక ఇన్‌స్ట్రక్టర్‌.. ఒక ఆయా

ప్రతి పాఠశాలలో ఒక ఇన్‌స్ట్రక్టర్‌తోపాటు ఒక ఆయాను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలవారి గౌరవ వేతనం రూ.8000, ఆయాకు రూ.6000 లుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీచేసి త్రీమెన్‌ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ఫ్రీ ప్రైమరీ సెక్షన్‌ను ప్రారంభించాలని, ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది.

ఫ ఆటపాటలతో కూడిన

విద్యా బోధనకు శ్రీకారం

ఫ కార్పొరేట్‌కు దీటుగా

ఆధునిక వసతులు

ఫ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో

ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

Advertisement
 
Advertisement
Advertisement